నవ లోకం


కొత్తాగా కనిపించే ఉదయం, కలతనే చెరిపేయదా
హాయిగా ఈ వీచే గాలి, విసుగునే మరిపించదా
పొద్దులొ పూచి రేయిలొ రాలే, పూవుల జన్మొక వింత
మబ్బులొ ముసురు మంచుగ మారి నా పై కురిసిందంట
నా పయనం సాగాలిక , నా పాదం అలిసే దాక

ఇన్ని వర్ణాలు ఉంటాయంటే నమ్మలేదా సమయం
చినుకును తాకి విరబూసే హరివిల్లును చూసేనే నయనం
కొమ్మల కూసి , కోనలొ ఎగిరే కొకిల గానం వింటా
వంపులు తిరిగే నది వయ్యరం మురిపించేనే దారి వెంటా
నా కవనం సాగాలిక , నా ఊహలు అలిసే దాక

-సంతొష్ దరూరి

Comments

  1. సంతోష్ గారూ....
    ఇప్పుడే మీ కవిత్వంలో తడిచాను. మీ ఉద్వేగాన్ని అక్షరీకరించడం మానకండి. యంత్రాలతో పనిచేస్తూ కూడా యంత్రంలా మారకుండా భావుకతను బ్రతికించుకుంటున్నందుకు అభినందనలు. ఇలాంటి కవిత్వమే మనిషిలోని మనీషి తనాన్ని పట్టిస్తుంది. మరొక్క మారు అభినందనలు
    ---- రవికాంత్

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం