Posts

Showing posts from August, 2009

యొధ

Image
కదన రంగం నేను వెలితే కంటి చూపు కత్తి చూసి కసిగ ఎగసి కెరటమల్లె తలలు తెగి పడిన జాడలడుగు తలలు వంచిన శత్రువలనడుగు...... నెత్తురంటిన కత్తినడుగు... గెలుపు ప్రభలను పంచుకుంటూ నే వెలుగు చూపిన దారులేన్నో చీకటి ఎన్నడు దారి చూపదు నిరాశ నిన్ను గెలువనీయదు గెలువలేమని ఎవ్వరనినా నిజమైనా గెలుపంటే పొరటమని చెప్పు -సంతొష్ దరూరి

నా తరమా

Image
బాదలెన్నైనాగాని ఓపితి నే ఓర్పుతొ వరముగ ఇచ్చిన సౌక్యములన్ని ఓపా నా తరమా వాంచలన్నియు నేటికి వాయుప్రియమైనాయీ సంపద కూర్చిన సిరులు తరగి కరగినాయీ ఎందెందో వెతకితి నే సుఖముల జాడల నీడలు ఇందిందే కలదంటూ .. నా అత్మ చూపినవా .. దేవా. చేసిన యుద్దలన్ని చెరితగనే మారుతాయీ నిత్య సంఘర్షనెపుడు నాలొనే జరుగుతుంది ఈ రాణల కారణాలు తెలిసేది ఎన్నటికో నేడై నా రేపటిలొ మొక్షమివ్వు దేవా..... -సంతొష్ దరూరి

"సంసారి "

"సంసారి " ఇంటి ముందల కురలు అమ్మా వస్తె పది అంటే ఐదంటవ్ "సంసారి " ఫ్రెష్ సుపెర్ మర్త్కెట్లొ పాకెట్లొ అమ్మితే ముసుకొని కొంటావు "సంసారి " రొడ్డెంబటి బుట్టలల్లి తక్కువకే అమ్ముతుంటే బెరాలడుతవే "సంసారి " పెద్ద బాజార్లలొ .. రెండికి మూడంటే ఎగబడి కొంటావే "సంసారి " పల్లెల్లొనే నేసి చీరలమ్మ వస్తె చవకగా ఇమ్మంటవ్ "సంసారి " బ్రదర్స్ షాపుల్లొ అదిరే రేట్లున్నా బెదరకా కొంటావు "సంసారి " బర్లను కాసి గొల్లల్లు పాలు పిండుక వస్తె నీళ్ళు కలిపారంటవ్ "సంసారి " ఆ పాకెట్టు పల్లల్లొ "సంసారి " నన్యతెంతొ చెప్పు "సంసారి " మండే ఎండల్లొన కుండలమ్మ వస్తే నా నా వంకలు పెడతవ్ "సంసారి " ఎల్జి సాంసంగులైనా కరంటు కొతే ఉంటే కుండే గతి నీకు "సంసారి " -సంతొష్ దరూరి

విశాఖ

Image
విశాఖ తొలిపొద్దుల కిరణాల వెలుగు వన్నెలొసగ తూరుపు దిశలో ఉన్న మణి తీరముగ తెలుగు గుండే తలపించే ౠషికొండే దీటుగా నిన్నటి సొగసుల పొదిగి, రెపటి ప్రగతి దిశగా శ్రీ శ్రీ నడిచిన ఇసక నే నెరిగిన విశాఖ -సంతొష్ దరూరి

తెలుగు సిరి కన్నె

Image
నా తెలుగు సిరి కన్నె వెలిగేటి విరి వన్నె నీ కాలి మువ్వల సవ్వళ్ళు నా చెవులను ముద్దాడితే నీ కన్నులు పంపిన చూపులు నా దారిలొ కనిపిస్తే అడుగులన్నీ కలిసి పరుగై నా కొసం వస్తె కాదనను ఎలా కవితా పుష్పమా -సంతొష్ దరూరి

అర కొర

నిక్కముగా రొక్కము ఒక పక్కకైనా నిలువదాయె చిల్లి పడ్డ కుండ వొలే, చింత పిక్కల వొలే, పొయిoన్రనో.... వచ్చిoన్రనో.... అడ్డుకట్ట లేక పాయె, అర కొరైనా మిగలదాయె, దెహి అనొ .. పాహి అనొ.. పావల.. పరకకనో... ఆడ తవ్వి ... ఈడ పూడ్చి ఈడ తవ్వి... ఆడ పూడ్చి.. ఎందాకో అప్పులాట -సంతొష్ దరూరి

క్రెడిట్ కార్డు

కంటి దురదా చేతి సరదా అప్పు పరదా లిమిట్ మీరదా క్రెడిట్ ఫార్ములా -సంతొష్ దరూరి

ప్రభంజనం

పలికిన ఒక్క పదము పలికించిన వెయి నోళ్ళ ప్రపంచమెరుగని ప్రగతికి ఓంకరమౌతుంది వెలిగిన ఒక్క దీపం వెలిగించిన అన్ని ఊళ్ళ చీకటి కమ్మిన బ్రతుకుల దారి చూపుతుంది మంచి కోరితే మనం చేయి కలుపరెం జనం మేలుకొలిపి అందరికీ చూపించు ప్రభంజనం -సంతొష్ దరూరి

నే మార్చలేను

Image
నే మార్చలేను కనిపించే మనుషుల్లొ విలువెంతొ చూడు వినిపించే నవుల్లొ నిజమెంతొ చూడు స్వర్ధాల.. లొభాల లొకాన్ని చూడు...... రుజువేది లేదు...రుజువేది లేదు ... చీకట్లొ సత్యాన్ని చూపించలేను వెలుగులో ఉన్నదంత నిరూపించలేను యుద్దలు చేసెంత గొడవేమి లేదు స్వార్ధాల ఈ జగతిని నే మార్చలేను -సంతొష్ దరూరి

నా సొగసూ పల్లెల్లొ

Image
........నా సొగసూ పల్లెల్లొ తెల్ల తెల్లంగ పొద్దు తెల్లరి పొతుంటే చిలకలన్ని గుడు ఒదిలి చెలకలల్ల పొతుంతయ్ గుళ్ళొ దేవుని మైకు నారాయణ పాడుతుంటది నొట్ల యాప పుల్ల యెసి గొడ్ల తొల్క పొతుంటరు మొట బావిల లోతు చూస్తే , రైతు బతుకులు చెప్పుతుంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ నిండనే నిండని ఊరి చెరువు లొట్టా చెట్లకు సుట్టాలైతయ్....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ చెట్ల మీదా వాలే గువ్వలు పొద్దే వాలిపొయిందంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ -సంతొష్ దరూరి