Posts

Showing posts from 2015
Image
చిగురు కొమ్మలు ---------------------------- ఏండిపొతే .. పండిపొతే.. చట్టు తనే.. వీడిపొతే.. చెప్పలెక...చావలేక...  బూడిదతొ  చలి కాచుకుంటే... ఆ  జాలి ఆకులకు ఆ గాలి తగిలి...... ఏక్కడో  పడవేస్తువుంటే.. చిగురు కొమ్మల  ఇగురు చూసి . . కంట తడి పెట్టింది ! అయ్యొ...     -సంతొష్ దరూరి       
Image
ఆ రొజు...... ఆ రొజు. నువ్వు రావడం ...  వెల్లిపొవడం మాత్రమే గురుతుంది.... నీ రాక తర్వాత.. నీతొపాటు చాటుగా వచ్హిన మౌనం , శూన్యం.. మన మద్య నిశ్యంబ్దాన్ని నింపిన సంగతి నువ్వు వెళ్ళాక కాని గుర్తుకు రాలేదు...          మన పెదవులు అడిగే ప్రెశ్నలు  వేరు.. . చూపులు మాట్లడుకొనే భాష వేరు... నీ కళ్ళలొ.. పౌర్ణమి వెన్నెల అలల సవ్వడి తప్ప...మరే నిశబ్ద శబ్దం.. ఏది నాకు వినపడలేదు..  నువ్వు వెళ్ళేప్పుడు .. వెళ్ళోస్తా  అన్న పదం నీ పెదవులపై ఎంతటి భారన్ని నింపిందో నాకు గురుతుంది... మళ్ళి రావని తెలిసి .. బదులివ్వని  నా మౌనానికి బదులిగా నువ్వు తిరిగి చూసిన క్షణం కూడా గురుతుంది.. ఇది మా  "చలం"  "ప్రెమలెఖలు"  కి అంకితం   సంతొష్ దరూరి   14/02/2015                          
Image
సూక్ష్మం......... సూక్ష్మ ఉద్వెగం పెదవి పలికితే అక్షరం... అక్షరాలు ఇమిడితే  వాక్యం.. వాక్యాల సమాహరం  గానం ... గానానికి ఆద్యం ..భావన.. ఆ భావనకి సాక్షం ..సత్యం... సత్యం... మనం  కాదు.   అనలేని .. అనంతనం .. అనంతం.. దైవం ఎరుగని ....సూక్ష్మం.....  దైవాత్మపు వ్యెతాసం ఎరుగని గమనం... జననం... -సంతోష్ దరూరి 08/02/15  
Image
    కొన్ని ....  కొన్ని స్మృతులు  గుర్తుంచుకొలెకపొవడం విషాదమైతే... కొన్ని జ్ఞాపకాలు మరిచిపొలేకపొవడం అత్యంత విషాదం... చెరిపెసి రాసుకొడానికి బ్రతుకు 'పలక ' కాదు జరిగింది మార్చుకోడాకిని   కాలానికి అటుపక్కనుంచి రాలేము          మనం మాయలు చెయలెం ... మనమే మాయలొ ఉన్నం.. .    మనం మాయం అయ్యెలొపు ... కొన్ని  జవాబులకు ప్రెశ్నలు రాసుకుందాం.     -సంతోష్  దరూరి 17/1/15            
మునుపెన్నడు జరగనట్టుగా ఇదంతా ఎదొ వింతనట్టుగా. నిను నువ్వే భందిస్తుంటే.. హ్రుదయాన్నే బాదిస్తుంటే... కనులను మూసి గతాన్ని చూసి రాసే కవితలు చదివకు రేపటిలొ... రగిలే లెఖలన్ని మసిగా  కలిసే చీకటిలొ..