Posts

Showing posts from 2017

సోమరులం

సోమరులం   ఊహల సరిహద్దులు చెరిపే   అలసత్వపు ఆశాజ్యోతులం   దిండుకి   పరుపుకి మధ్య ప్రపంచాన్ని వెతుకుతుంటాం   గెలుపుకి గమ్యానికి దూరం తక్కువ చేసుకుంటాం     మనకు గురకలు లాలి పాటలు   మధ్యాహ్నపు కునుకులు మలయమారుతాలు ... నిండు జాబిలికి చికటి చెద్దరు కప్పే   ఆవిశ్రాంత బాటసారులం   వెలుగుపడితే విసిగిపడే   నిర్ధర్యపు   ఆశుద్ధతుడ్పిత కాగితాలం   యొగత్వం   మరచిన వినియొగ భాస్వరపు వ్యర్ధాలం   హ్మ్మ్ ... మనుషులం   - సంతోష్ దరూరి
మన: చిత్తం    ఏగసిపడి కనిపించలేని అమావాస్యపు కెరటం   శిల్పిని ప్రెశ్నించే   రాతి స్తైర్యం దారి తెలియని బాటసారి కాలి గాయం రాత్రిని వెంటాడే చీకటి నిశిలొ ఒదార్పు కోరే వ్యధలు   దూరం తెలిపే భాధ   బయటపడలేని గొంగలి పురుగు ఆక్రొషం ఊహ తెలియని పసి బాలుని ఏడుపు   చంపి జయించలేని శత్రువు   నిలువువరించలేని వ్యసనం   నిజం చెయలేని స్వప్నం కాలి కింద  కనిపించక నలిగిన చిగురుటాకు ఉండి వ్యక్తపరచలేని  ప్రేమ విశ్వసించి నిరూపించలేని దేవుడు చేరుకొలేని అమ్మ ఒడి   నిశ్చల స్తిర సౌధం నా  మన: చిత్తం -సంఘహిత      
ప్రేమ సహనాన్ని  నేర్పిస్తే వ్యామొహం  ఆత్రుతావెషాలతొ మొసం చేస్తుంటే ఆ నా ఊహలనద్దిన హ్రుదయ వర్ణం ఏమంటే నా  సంధిద్గ   చిత్తరువును నే నెల  చూపను ? -సంఘహిత