Posts

Showing posts from 2018
హ్రుదయం విచ్చుకొనేటప్పుడు పగిలినట్టుగా  కనిపిస్తుందు సంఘహిత

అక్షరాల చాటే

ఎప్పుడు ఈ అక్షరాల చాటే  తల దాచుకున్నా....  ఉద్వేగం పొందినపుడు  అశలు రెక్కలైనప్పుడు    కోరికలు కురుసినప్పుడు ఏప్పుడు తడవకుండా  సముద్రాన్ని ఈదుతున్నా    గాలికి కరగని గంధానై ...మంటలు  చెరచని  విరహన్నై

సందేశమే

చీకటి లొ హృయుదయం విరుచుకున్నా  ఎవరికి  తెలుస్తుంది కనిపించని చెవులకి... వినిపించె కళ్ళకు    మాత్రం తప్ప!  నీకు పంపించని లేఖ కూడా సందేశమే నువ్వు నేను కలిసి ఉన్నా .. నాకది వైరాగ్యమే నా ప్రతి మాట కవిత్వం కాకపొవచ్చు .. ప్రాసలు విరగి పడి ఉండవచ్చు  అపుడు ఈ అక్షరాలు మ్మత్రమే న వెంట నిలిచాయి  నీకు నాకు వారధిగా.....

తాను నేను - అగ్గి పుల్ల

Image
తాను నేను  - అగ్గి పుల్ల  తనని ముద్దాడిన మరుక్షణమే   వెలిగిపొతాను .. కాలిపొతాను ...   బూడిదవుతాను ... తన అనువనువు నాకు తెలుసు నేను కాలి పొవడం లేదు......   పవిత్రంగా వెలుగుతున్నను   నేను ఎక్కువ సమయం   ఉండనని తెలుసు ,   ఇంక కసెపట్లొ   బూడివుతాననీ తెలుసు , ఆ వేదనకు నేనెప్పుడు   దూరమవుతాననుకొలేదు .. తను మత్రం ఎమి చేయగలదు ?   నన్ను చూస్తు ఉండిపొయింది తను మనసిప్పుడు ఖాళి !!     మా ఇద్దారి మధ్య వెలిగెంత   ప్రేమ .. బూడిదయ్యెంత దూరం     -సంఘహిత 

అప్రకటిత రారాజు

అప్రకటిత  రారాజు నెనెపుడూ పరిమలిస్తూనే ఉంటాను నాలొ...  అస్తమించిన  ఆశలు ఎన్నొ నాలొ.. జీవొన్మాదాన్ని నింపిన ఉషస్సులు ఎన్నొ నేనెపుడూ ప్రజ్వలిస్తూనే ఉంటాను నా వెలుతురు చేరని చోటిని ... ఓదారుస్తు ఉంటాను    నిస్సహాయత  స్మశాన వైరగ్యాన్ని చేరినప్పుడు  నెత్తురోడిన యోధులను  గెలిపించిన స్తైర్యాన్ని  గుర్తు చేసుకుంటాను  అసహనాన్ని కొవ్వత్తిలొ చిదిమి ఊపిరులూదుతుంటాను నేను నువ్వెరుగని  అప్రకటిత  రారాజును -సంఘ హిత